హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మిచేడు జమ్ములమ్మ అద్భుత రూపం

GDWL: గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ, హోమం తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.