హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓఆర్‌ఆర్‌పై ఎలక్ట్రిక్ కారులో మంటలు.. క్షణాల్లో దగ్ధం

HYD: కోకాపేట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట్ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ కారు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినడంతో పాటు కొద్ది నిమిషాల్లోనే వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రత్తమైన ప్రయాణికులు వెంటనే కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది.