హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసులకు చిక్కిన మోటార్ల దొంగలు

WGL: వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లను దొంగిలిస్తున్న ముఠాను గురువారం నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు WGL ఈస్ట్ జోన్ DCP అంకిత్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.18.44 లక్షల విలువైన 84 విద్యుత్ మోటార్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.