హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేకాట స్థావరంపై దాడిలో 10 మంది అరెస్టు'

WNP: చిన్నంబావి మండల పరిధిలోని గూడెం దారిలో కాశిరెడ్డి వాగు సమీపంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దగడపల్లి, పెద్దదగడ, బెక్కెం, గూడెం, పెద్దమారూరు, కొప్పునూర్ గ్రామాలకు చెందిన వీరి నుంచి రూ.18,200 నగదు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చిన్నంబావి మండల SI రామన్ గౌడ్ తెలిపారు.