హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు

MHBD: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్సైజ్ చట్టం కింద నమోదైన కేసులో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన పోరేటి మోహన్ రెడ్డిని నాగారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసి గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సూర్యాపేట సబ్‌జైలుకు తరలించారు.