హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతర పనులను పరిశీలించనున్న.. MLA గండ్ర

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర అభివృద్ధి పనులను శుక్రవారం భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పున్నం రవి తెలిపారు. ఈ సందర్భంగా MLA జాతర పనులను పరిశీలించి, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నాయకులు, అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.