HNK: క్రమబద్ధీకరణ డిమాండ్‌తో కాకతీయ విశ్వవిద్యాలయ కాంట్రాక్టు అధ్యాపకులు గురువారం క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. KU కాంట్రాక్టు ఫ్యాకల్టీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీసీ ప్రొ. పి. ప్రతాప్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెగ్యులర్ నియామకాలకు ముందే తమను క్రమబద్ధీకరించాలని, UGC వేతనాలు ఇవ్వాలని కోరారు. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
KU కాంట్రాక్టు అధ్యాపకుల ర్యాలీ


