హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 22 నుంచి పీజీ సెమిస్టర్‌-1 తరగతులు ప్రారంభం'

మహబూబ్‌నగర్ జిల్లా ఎం.వి.ఎస్ కళాశాలలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్‌లో ఈ నెల 22వ తేదీ ఆదివారం నుంచి పీజీ మొదటి సంవత్సరం సెమిస్టర్‌-1 తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పుస్తకాలు, ఫీజు రసీదులతో తరగతులకు హాజరుకావాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ సూచించారు.