హైదరాబాద్: 28°C
తెలంగాణ

హ్యాండ్‌బాల్ టోర్నీకి సీఎం రేవంత్ ముఖ్య అతిథి

మహబూబ్‌నగర్ భగీరథ కాలనీలోని హైస్కూల్‌లో ఈ నెల 23న 70వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్‌-19 బాలబాలికల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.