JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం విలువైన వెండి నాగాభరణం బహుమతిగా అందింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన భక్త దంపతులు అనంతలోజ్ రాజు, స్వర్ణలత ఈ కానుకను సమర్పించారు. సుమారు రూ.1.80 లక్షల విలువ కలిగిన, 1 కిలో 22 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేసిన ఈ నాగాభరణాన్ని వారు ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
తెలంగాణ
సోమేశ్వర స్వామికి వెండి నాగాభరణం సమర్పణ


