హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్

ADB: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి సూచికల్లో జిల్లా ర్యాంకు మెరుగుపరిచేలా PHC వారీగా ప్రగతి సాధించాలన్నారు. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న ప్రసవాలను మరింత పెంచాలని స్పష్టం చేశారు.