హైదరాబాద్: 28°C
వార్తలు

తుఫాన్ ఎఫెక్ట్.. 47 రైళ్లు రద్దు

ఒడిశాలో తుఫాన్ ముప్పు నేపథ్యంలో సీఎం మోహన్ చరణ్ మాఝీ సన్నద్ధతను సమీక్షించారు. ఇప్పటివరకు 3లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో 47 రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం NDRF, ఓడ్రాఫ్ బృందాలను మోహరించినట్లు చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు.