హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ పనులపై సీతక్క సమీక్ష

TG: రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల హాజరు గణనీయంగా పెరుగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో ఉపాధి హామీ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. నవంబర్‌లో రోజువారీ సగటు హాజరు 5.97 లక్షలకు చేరిందని అధికారులు తెలిపారు. ఈనెల 18న ఒక్కరోజే 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ప్రస్తుతం పంచాయతీకి సగటున 47 మంది వస్తున్నారు. ఈ సంఖ్యను 60కి పెంచాలని అధికారులను ఆదేశించారు.