హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఇవాళ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. నరసాపురం - పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. ఆ సమయంలో గరిష్టంగా 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.