హైదరాబాద్: 28°C
క్రీడలు

మేమూ బాల్ టాంపరింగ్ చేశాం: అక్తర్ 

2018 బాల్ టాంపరింగ్ వివాదంపై ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడే రోజుల్లో పాకిస్తాన్ కూడా బాల్ టాంపరింగ్ చేసిందని ఒప్పుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బాటిల్ మూతలతో బంతి ఆకారం మార్చేవాళ్లమని తెలిపాడు. ఆ విషయం జట్టు మొత్తానికి తెలుసని అక్తర్ పేర్కొన్నాడు.