హైదరాబాద్: 28°C
క్రీడలు

టెంబా బవుమా ప్రపంచ రికార్డ్

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో ఏకంగా 14 విజయాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఇందులో ఒక ఓటమి, ఒక డ్రా మాత్రమే ఉన్నాయి. అతడి విజయ శాతం 87.5%గా నమోదైంది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజం లిండ్సే హ్యాసెట్ పేరిట ఉన్న 13 విజయాల రికార్డును బవుమా బద్దలు కొట్టాడు.