రావల్పిండిలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసేసరికి లంక రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 309 పరుగులు చేసి 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మిలన్ రత్నాయకే (60*) పోరాడగా, పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు, అబ్బాస్, రజావుల్లా చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో లంక 98కి ఆలౌట్ కాగా, పాకిస్తాన్ 325 పరుగులు చేసింది.
క్రీడలు
శ్రీలంకతో రెండో టెస్టు.. విజయం దిశగా పాకిస్తాన్


