హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంటిపేరుతో కాదు.. ఆటతోనే గుర్తింపు: సెహ్వాగ్‌

ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో పరుగుల వరద పారించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తన కుమారుడు ఆర్యవీర్‌పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇంటిపేరుతో కాకుండా ఆటగాడి ప్రతిభను ఆటను బట్టే అంచనా వేయాలన్నాడు. క్రికెటర్ కుమారుడనే విమర్శలకు ఆర్యవీర్ తన భారీ స్కోర్లతోనే సమాధానం చెప్పి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని సెహ్వాగ్ కొనియాడాడు.