భోపాల్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు టైటిల్ వేటను ఘనవిజయంతో ప్రారంభించింది. తొలి క్వార్టర్‌లో మలేసియా గోల్‌తో వెనుకబడిన భారత్, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. సలీమా టెటె గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత అమ్మాయిలు, అనంతరం మరో మూడు గోల్స్ సాధించి 4-1 తేడాతో మలేసియాను చిత్తు చేశారు.
క్రీడలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ శుభారంభం


