హైదరాబాద్: 28°C
వార్తలు

పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

NZB: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి నిజామాబాద్ పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2021లో 12 ఏళ్ల బాలికపై నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసి బెదిరించాడు. గర్భం బయటపడటంతో తల్లి ఫిర్యాదు మేరకు టౌన్ -1 పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి దుర్గాప్రసాద్.. నిందితుడికి శిక్ష, జరిమానా విధించి బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.