హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీటి లభ్యతను అనుసరించి పంటలు సాగు చేయాలి'

SRD:​ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశమున్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సిర్గాపూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ నేడు సూచించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరికి బదులు కంది, పెసర, మినుము, శనగ,కుసుమ, జొన్న వంటి తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.