హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మండలానికి 692 నూతన పింఛన్లు'

PDPL: ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలకు 692 నూతన చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. నంది మేడారం గ్రామానికి అత్యధికంగా 92 పెన్షన్లు మంజూరయ్యాయి. అత్యల్పంగా బుచ్చయ్యపల్లి గ్రామంలో కేవలం 3 పింఛన్లు మాత్రమే మంజూరు చేశారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ, గీత, చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.