హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆర్మూర్‌కు మంత్రి సీతక్క రాక

NZB: ఆర్మూర్ పట్టణానికి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్  గౌడ్ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వారు హాజరుకానున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించనున్నారు.