NZB: భీమగల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా స్వామివారి కల్యాణ క్రతువును నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో నింబాచల కొండ గోవింద నామస్మరణతో మార్మోగింది.
తెలంగాణ
VIDEO: లింబాద్రిగుట్టపై మార్మోగిన గోవింద నామస్మరణ


