BDK: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ విజ్ఞాన్ స్కూల్ విద్యార్థి గోపిరామ్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని శాలువాతో సత్కరించారు. క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మణుగూరుకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గోపిరామ్ ఎంపిక


