హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్రీహోల్డ్ భూములపై జేసీ సమీక్ష

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కారం, రీసర్వే 5, 6 దశల్లో పెండింగ్‌లో ఉన్న డీఎల్ఆర్ పనుల పురోగతిని ఆరా తీశారు. మండలాల వారీగా పెండింగ్ పనులను గుర్తించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.