హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షిరిడిసాయి మందిరం వార్షికోత్సవం

VZM: బొబ్బిలి పట్టణం దావాలవీధిలోని షిరిడిసాయి మందిరం 17వ వార్షికోత్సవాన్ని ఈ నెల 22న ఆదివారం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున కాగడా హారతి, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సాయంత్రం ప్రత్యేక హారతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.