హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

PPM: వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డా.టి. జగన్‌మోహనరావు సూచించారు. గురువారం కొమరాడ మండలం కళ్లికోట గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజరు,మందుల నిల్వలు, వైద్య పరీక్షలకు అవసరమైన కిట్ల లభ్యతను పరిశీలించారు.