హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకమహాలక్ష్మి మాసోత్సవాలకు ఏర్పాట్లు

VSP: డిసెంబర్ 9 నుంచి జనవరి 7 వరకు జరిగే కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించాలని జేసీ విద్యాధరి అధికారులను ఆదేశించారు. తొలిసారిగా ఆన్‌లైన్ దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.