NLG: కట్టంగూర్ పీఏసీఎస్‌లో రూ.10 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ పిట్టంపల్లి గ్రామానికి చెందిన చేవుగోని చంద్రశేఖర్ గురువారం నల్గొండలో డీసీవోకు ఫిర్యాదు చేశారు. ఆదాయానికి మించి ఖర్చులు చూపించడంతో పాటు, ఇన్సెంటివ్‌ల పేరుతో ఆధారాలు లేకుండా నిధులు వినియోగించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పీఏసీఎస్‌లో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు


