హైదరాబాద్: 28°C
తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ వారోత్సవాలు

JGL: పెగడపల్లి మండలం రాజారాంపల్లిలో జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మధుమేహ వారోత్సవాలు నిర్వహించారు. 60 మందికి బీపీ, షుగర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేపట్టి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలని సభ్యులు అవగాహన కల్పించారు.