హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చక్రాయపేటలో జనసేన కార్యాలయం ప్రారంభం

KDP: చక్రాయపేట మండల కేంద్రంలో జనసేన నూతన కార్యాలయాన్ని ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరారు. అనంతరం మండలంలోని జనసేన సర్పంచ్ అభ్యర్థి కర్నాటి భాగ్యమ్మతో పాటు వార్డు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభ్యర్థులకు మద్దతుగా నిలిచి నామినేషన్ ప్రక్రియలో సహకరించారు.