హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం'

KRNL: భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని కర్నూలు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, పేదలకు బ్రెడ్లు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.