హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరు ఎంపీపీగా కాడే లలిత ఏకగ్రీవ ఎన్నిక

కడప జిల్లా ముద్దనూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా టీడీపీకి చెందిన కాడే లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారులు ఆమె ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఎంపీపీగా ఏకగ్రీవ ఎన్నిక కావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కాడే లలితకు అభినందనలు తెలియజేశారు.