హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలవేళ నిబంధనలు తప్పనిసరి: ఎస్సై

ఏలూరు చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో పోలీసులు గురువారం రాత్రి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్సై డి రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలన్నారు. తగాదాలు, గొడవలకు దిగవద్దన్నారు. పాత కక్షలు, ఘర్షణలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.