హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోహాన్ (4) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం కిరాణా దుకాణానికి వెళ్తున్న సజావుద్దీన్, మెహరీన్ కుమారుడైన జోహాన్ ను కారు ఢీకొన్నట్లు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.