హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ ఛాంపియన్ షిప్‌లో నెల్లూరు క్రీడాకారుడి సత్తా

మైసూరులోని క్రీడే ఇండోర్ క్లబ్‌లో నిర్వహించిన తొలి జాతీయ వీల్ ఛైర్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్–2026లో నెల్లూరుకు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ ప్రతిభ కనబరిచారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని, నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన సాధించిన విజయంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు రకాల పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచారు.