AKP: మాకవరపాలెం మండల పరిషత్ నూతన పాలకవర్గ సభ్యులు గురువారం సాయంత్రం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీపీ సబ్బవరపు సత్యవరలక్ష్మి, వైస్ ఎంపీపీ పాశపు చిట్టినాయుడు, ఎంపీటీసీ సభ్యులను స్పీకర్ అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన పాలకవర్గానికి స్పీకర్ అభినందనలు


