హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్య రెండుసార్లు భర్త ఒకసారి ఎంపీటీసీగా విజయం

ELR: ఉంగుటూరు మండలం కైకరం ఎంపీటీసీ సభ్యురాలిగా ఘంటసాల సరస్వతి టీడీపీ రెండోసారి ఎన్నికయ్యారు. కైకరం పంచాయతీ రామన్నగూడేనికి చెందిన ఘంటసాల తిరుపతిరావు భార్య సరస్వతి తొలుత 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బలే దుర్గమ్మపై విజయం సాధించారు. గతంలో ఘంటసాల తిరుపతిరావు కూడా ఎంపీటీసీగా విజయం సాధించారు.