హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాచారెడ్డిలో ఎక్సైజ్ శాఖ దాడులు

KMR: మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మైసమ్మ చెరువు తండాలో 5 లీటర్లు, సోమవారం పేటలో 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పేట శివారులో 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, ఒకరిపై కేసు నమోదు చేశారు.