హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనాల వేలంతో ప్రభుత్వానికి ఆదాయం

WNP: జిల్లాలో మద్య నిషేధ, అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన 15 వాహనాలకు అధికారులు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో 12 వాహనాలు అమ్ముడుపోవడంతో రూ. 2,11,500 ఆదాయం సమకూరింది. జీఎస్టీ రూపంలో మరో రూ. 26,400 కలుపుకొని ప్రభుత్వానికి మొత్తం రూ. 2,37,900 ఆదాయం వచ్చినట్లు జిల్లా అబ్కారీ అధికారి లింగాచారి ఒక ప్రకటనలో తెలిపారు.