హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

అన్నమయ్య: ఓబులవారిపల్లె మండలం మంగంపేట మూడవ వీధిలోని వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి యనమల ఉమాదేవి రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. గురువారం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె, తన విజయానికి సహకరించిన గ్రామస్తులకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ అభివృద్ధికి విరాళం ప్రకటించి తన భక్తిని, గ్రామంపై అభిమానాన్ని చాటుకున్నారు.