హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సుంకిరెడ్డి–ఉద్యోగ భరోసా’తో 71 మందికి కొలువులు

RR: గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపట్టిన ‘సుంకిరెడ్డి–ఉద్యోగ భరోసా’ విజయవంతంగా సాగుతోంది. మాడ్గులలో నిర్వహించిన 26వ జాబ్ డ్రైవ్ ద్వారా తుక్కుగూడ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో రెండు విడతల్లో మొత్తం 71 మంది (తొలి విడత-52, రెండో విడత-19) ఎంపికయ్యారు.