హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా

బాపట్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేతృత్వంలో రాగా, టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 15 ఎంపీటీసీల్లో వైసీపీకి 8, టీడీపీకి 7 ఉన్నాయి. సభ్యులు అడ్డుకోవడంతో ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.