హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు విద్యాసంస్థలకు సెలవు..!

SKLM: అక్వాన్ తుఫాను ప్రభావం నేపథ్యంలో తీరప్రాంత మండలాల్లో ఉన్న విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు, 11 తీరప్రాంత మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెలిపారు. అంగన్‌ వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు.