WG: తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం నామినేషన్ల విత్ డ్రా సమయానికి 11, 12, 21వ వార్డుల నుంచి ఒక్కో నామినేషన్ మాత్రమే మిగిలాయి. దీంతో ఆయా వార్డుల నుంచి పోటీలో ఉన్న పిడుగు గీతా స్రవంతి, పైబోయిన కిరణ్ కుమార్, వర్తనపల్లి కాశి విశ్వేశ్వరరావు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో మూడు వార్డులు ఏకగ్రీవం


