ASR: అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామంలో పేలుడు ఘటనలో ఇళ్లు దెబ్బతిన్న 12 కుటుంబాలకు కలెక్టర్ టి. నిశాంతి గురువారం ఆర్థిక సాయం అందించారు. గృహాల మరమ్మతుల కోసం ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేలుడు ఘటన కుటుంబాలకు ఆర్థిక సాయం


