హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో చట్టంపై విద్యార్థినులకు అవగాహన

ప్రకాశం: గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో బాలల రక్షణ, పోక్సో చట్టంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ విద్యార్థినులకు పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని, అవసరమైతే 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.