హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు మహిళా ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి

KMM: వివిధ పోలీస్ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తూ నిరంతర సేవలందించిన ఎస్‌డీ. సలీమాబేగం, టి. నాగరాజకుమారికి ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఇద్దరు మహిళా పోలీస్ అధికారులకు పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. బాధ్యతలను నిర్వహిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని అన్నారు.