హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ అభ్యర్థిపై దాడి.. ఇద్దరి అరెస్ట్

అన్నమయ్య: టీ.సుండుపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్‌కు వెళ్తున్న గోళ్ల రెడ్డెప్పపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 10 మందిని రిమాండ్‌కు పంపగా, తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.